- Advertisement -
రాయపర్తి: వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను కారు ఢీకొట్టడంతో తండ్రీ కుమార్తెలు దుర్మరణం చెందగా అల్లుడు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం నిమిత్తం అతడిని హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మెరిపిరాలకు చెందిన వెంకన్న తన కూతురు అనుష, అల్లుడు రాజేశ్‌ను తన ఇంటికి తీసుకొస్తుండగా కిష్టాపురం క్రాస్ రోడ్డు వద్ద బైక్‌ను కారు ఢీకొట్టింది. వెంకన్న, అనూష ఘటనా స్థలంలో చనిపోగా రాజేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో పండుగపూట ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఆ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Also Read: ప్రపంచ్ కప్ కే ఆ రెండు సీట్లు హైలెట్
- Advertisement -