Thursday, November 14, 2024

మధిర బైపాస్ రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించని ఆర్‌అండ్‌బి అధికారులు

- Advertisement -
- Advertisement -

మధిర : మధిర బైపాస్ రోడ్డులో ఆర్ అండ్ బి అధికారులు కొత్తగా వేసిన తారు రోడ్డులో నాణ్యత ప్రమాణాలను పూర్తిగా పాటించలేదని, రోడ్డుకు ఇరువైపులా మట్టితో ఏర్పాటు చేసిన ఫుడ్ పార్థు రోడ్డు ప్రమాదకరంగా ఉందని, ఫుట్ పాత్ రోడ్డు వెడల్పుని పెంచాలని, తారు రోడ్డును డబల్ రోడ్డులుగా ఏర్పాటు చేయాలని, సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. తారు రోడ్డు నిర్మాణంలో కనీసం రెండు అంగుళాల మందం కూడా తార్ రోడ్డును వేయలేదని దాని వలన ఇప్పటికే రోడ్డు సతికిపోయి, గుంటలు ఏర్పడుతుందన్నారు.

తారు రోడ్డుకి ఇరువైపులా పోసిన ఫుట్పాత్ పై మట్టి ఇరువైపులకు జారి రోడ్డు మీద నుండి పక్కకు తప్పించుకోవడానికి వీలుగా లేకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇప్పటికైనా ఆర్ అండ్ బి అధికారులు స్పందించి తారు రోడ్డు నాణ్యత ప్రమాణాలతో మరియు ఫుట్పాత్ ఇరువైపులా వెడల్పు చేయాలని కోరారు. ఈ రోడ్డున పరిశీలించిన వారిలో సిపిఎం పార్టీ పట్టణ మండల,కార్యదర్శి లు మండవ ఫణీంద్ర కుమారి, మందా సైదులు, సిపిఎం పార్టీ టౌన్ కమిటీ సభ్యులు పడకంటి మురళి, తేలప్రోలు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News