ముంబయి: క్రెడిట్ కార్డులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బిఐ) కొత్త రూల్స్‌ను తీసుకువచ్చింది. ఈ రూల్స్ 2022 జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. పేమెంట్స్ బ్యాంక్, ప్రభుత్వ రంగ కోఆపరేటివ్ బ్యాంక్స్, డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ మినహా ఇతర బ్యాంకులన్నింటికీ ఈ రూల్ వర్తిస్తాయి. దాంతోపాటుగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ) ఎన్‌బీఎఫ్‌సీలు కూడా వర్తించనుంది.ఈ నిబంధనల ప్రకారం క్రెడిట్ కార్డు క్లోజర్‌కు సంబంధించి అప్లికేషన్ వచ్చిన 7 రోజులలోగా సదరు క్రెడిట్ కార్డును క్లోజ్ చేయాల్సి ఉంటుందని ఆర్‌బిఐ ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉండగా క్రెడిట్ కార్డు యూజర్లు అన్నీ బకాయిలు పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. క్లోజర్ విషయంలో సదరు బ్యాంకులు, సంస్థలు కార్డు దారులకు ఈమెయిల్, ఎస్‌ఎంఎస్ రూపంలో వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. ఏడు రోజులలోగా క్రెడిట్ కార్డును క్లోజింగ్ అప్లికేషన్‌ను పూర్తి చేయకపోతే.. అప్పుడు బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సీలు కస్టమర్లకు రోజుకు రూ.500 పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.
క్రెడిట్ కార్డును ఏడాదికి పైగా ఉపయోగించకపోతే అప్పుడు బ్యాంకులు ఆటోమేటిక్‌గానే ఆ కార్డును పూర్తిగా క్లోజ్ చేయాలి. కాగా ఈ విషయాన్ని ముందుగా కస్టమర్లకు తెలియజేయాలి. వారి నుంచి 30 రోజులలోగా ఎలాంటి వివరణ రాకపోతే క్రెడిట్ కార్డును క్లోజ్ చేసే అధికారం ఆయా సంస్థలకు ఉంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కార్డు క్లోజింగ్ వివరాలను క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్ కంపెనీలకు 30 రోజులలోగా తెలియజేయాలి. క్రెడిట్ కార్డులో కస్టమర్లకు రావాల్సిన డబ్బులు ఏమైనా ఉంటే..బ్యాంకులు వాటిని వారి బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్ల అనుమతి లేకుండా బ్యాంకులు, ఇతర సంస్థలు కార్డులు జారీ చేయడం, అప్‌గ్రేడ్ కార్డులు అందించడం వంటివి చేయకూడదు. కార్డ్-జారీ చేసేవారు/వారి ఏజెంట్లు తమ రుణ సేకరణ ప్రయత్నాలలో ఏ వ్యక్తిపైనైనా ఎలాంటి బెదిరింపు లేదా వేధింపులను ఆశ్రయించకూడదు. క్రెడిట్ కార్డ్‌లను ఉచితంగా జారీ చేసేటప్పుడు ఎటువంటి హిడెన్ ఛార్జీలను వేయకూడదు.
RBI Alerts to Credit Card Users