Monday, January 20, 2025

తెలంగాణ ఖజానాకు రూ.4 వేల కోట్లు.. ఆర్‌బిఐలో ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లు వేలం

- Advertisement -
- Advertisement -

RBI allows Telangana Govt borrow Rs.4000 crore

మనతెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ ఖజానాకు రూ.4 వేల కోట్లు సెక్యూరిటీ బాండ్లు వేలంతో సర్దుబాటు కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఊరటనిచ్చింది.బాండ్ల ద్వారా అప్పులు తీసుకునేందుకు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. మంగళవారం రిజర్వ్‌బ్యాంక్ ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ వేలంలో రూ.4 వేల కోట్లను అప్పు ద్వారా తెలంగాణ ప్రభుత్వం నిధులను సమీకరించుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్లు వేలం వేయనున్నారు. ఈ బాండ్లు 13 సంవత్సరాల కాలానికి 8.02% వడ్డీ రేటుతో బాండ్ ఆధారిత బ్యారోయింగ్‌లను పొందింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రూ.4 వేల కోట్లు 14 సంవత్సరాల కాలానికి 8.03% వడ్డీ రేటుతో, మహారాష్ట్ర ప్రభుత్వం రూ.4 వేల కోటు 10 సంవత్సరాల కాలానికి 7.89% వడ్డీ రేటుతో, తమిళనాడు ప్రభుత్వం 20 సంవత్సరాల కాలానికి 7.99% వడ్డీ రేటుతో సెక్యూరిటీ బాండ్లు వేలం వేసి నిధులను సమీకరించుకోనున్నాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బాండ్ల ద్వారా రూ.53 వేల కోట్లు అప్పుగా తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించింది. రెండేళ్లుగా కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న బడ్జెటేతర రుణాల విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసిన కేంద్రం ఇప్పటి వరకు అప్పులు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇవ్వలేదు. కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలు, అడిగిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. రెండు నెలలుగా అప్పులకు అవకాశం ఇవ్వకపోవడంతో నిధులు సర్దుబాటు చేయక రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పడింది. ఆ ప్రభావంతో రెండు మాసాలుగా రాష్ట్రంలో జీతాలు ఆలస్యమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పాదించిన మొత్తంలో కొంత కోత విధించి అనుమతిచ్చినట్టు తెలిసింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ద్వారా నిధులు సమీకరించుకోనున్నది. దీంతో రూ.4వేల కోట్లు రుణాల ద్వారా సమీకరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు ద్వారా 13 ఏండ్లకు బాండ్లు జారీ చేసింది.

RBI allows Telangana Govt borrow Rs.4000 crore

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News