Monday, January 20, 2025

19 నుంచి సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆర్‌బిఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తక్కువ రేకే బంగారాన్ని కొనుగోలు చేసే సువర్ణావకాశాన్ని తీసుకొచ్చింది. సావరిన్ గోల్డ్ బాండ్(ఎస్‌జిబి) స్కీమ్ 2023-24 మొదటి సిరీస్ జూన్ 19 నుంచి జూన్ 23 మధ్య నిర్ణయించారు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. అదే సమయంలో సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023-24 రెండో సిరీస్ సెప్టెంబర్‌లో జారీ చేస్తారు.

ఎస్‌జిబి ప్రభుత్వం తీసుకొచ్చిన గోల్డ్ బాండ్ పథకం, దీనిలో పెట్టుబడి పెట్టిన డబ్బు భద్రతకు భారత ప్రభుత్వం హామీ ఇస్తుంది. ఈ బాండ్ పథకాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంక్ జారీ చేస్తుంది. 999 స్వచ్ఛత బంగారం ముగింపు ధర సాధారణ సగటు ఆధారంగా నిర్ణయిస్తారు. ఆన్‌లైన్‌లో చెల్లిస్తే 10 గ్రాములకు రూ.50 తగ్గింపు ఇస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News