Monday, December 23, 2024

తెలంగాణ ‘మిత్తి’మీరలేదు

- Advertisement -
- Advertisement -

అప్పుల్లో అడుగున.. వడ్డీ శాతంలోనూ ఆఖరున

దక్షిణాది రాష్ట్రాలన్నింటి కంటే మెరుగు
30% వాటా దక్షిణ భారతానిదే
తలసరి ఆదాయంలో తెలంగాణ ఫస్ట్

న్యూఢిల్లీ: అప్పుల విషయంలో కానీ, తీసుకొచ్చిన అప్పులకు చెల్లించే వడ్డీ శాతం విషయంలో కానీ తెలంగాణ రాష్ట్రం మిగతా దక్షిణాది రాష్ట్రాలకన్నా మెరుగ్గా ఉందని భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) తాజా నివేదిక వెల్లడించింది. తొమ్మిదేళ్ల క్రితం రాష్ట్రం ఏర్పడే నాటికి మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ గత తొమ్మిదేళ్ల కాలంలో విపరీతంగా అప్పులు చేయడంతో లోటు రాష్ట్రంగా మారిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. అనుతా ్పదక ఖర్చుల కోసం అప్పులు చేయడం ద్వారా రాష్ట్రప్రభుత్వం తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చేసిందనేది వారి ప్రధాన ఆరోపణ. అయితే ఆర్‌బిఐ తాజా గణాంకాలు, ఇతర సర్వేలను బట్టి చూస్తే ప్రతిపక్షాల ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని స్పష్టంగా తెలుస్తుంది. తలసరి ఆదాయం విషయంలో కానీ రాష్ట్ర రాబడిలో అప్పుల శాతం విషయంలో కానీ, తీసుకొచ్చిన అప్పులకు చెల్లించే వడ్డీల విషయంలో కానీ మిగతా దక్షిణాది రాష్రాలతో పోలిస్తే తెలంగాణ ఎంతో మెరుగైన స్థితిలో ఉండడం గమనా ర్హం.

తమిళనాడు, కర్నాటక, తెలంగాణ, ఎపి, కేరళ రాష్ట్రాలను దక్షిణాది రాష్ట్రాలుగా వ్యవహరిస్తూ ఉంటారు. దేశ స్థూల జా తీయ ఉత్పత్తిలో 30 శాతం ఈ అయిదు రాష్ట్రాలనుంచే లభిస్తోం దని ఈ గణాంకాలు చెబుతున్నాయి. అందులోనూ నూతనంగా ఏర్పడినప్పటికీ తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా ఇప్పటికే అభివృద్ధి చెందిన తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలతో పోటీ పడే విధంగా అభివృద్ధి సాధిస్తుండడం  విశేషం. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో రాష్ట్రప్రభుత్వం అభివృద్ధే లక్షంగా తీసుకున్న చర్యలే దీనికి కారణం. రాష్ట్ర స్థూల జాతీయ ఆదాయం(జిఎస్‌డిపి) విషయంలో తమిళనాడు ప్రస్తుత ధరల ప్రకారం రూ. 24.8 లక్షల కోట్లతో ప్రథమస్థానంలో నిలవగా 22.4 లక్షల కోట్లతో కర్నాటక రెండో స్థానంలో ఉంది.

వీటితో పోలిస్తే అన్ని విధాలా చిన్న రాష్ట్రమైన తెలంగాణ రూ.13.3లక్షల కోట్లతో మూడో స్థానంలో నిలిచింది. రూ.13.2 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్, రూ.10 లక్షల కోట్లతో కేరళ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. బలమైన ఆర్థిక వ్యవస్థకు గీటురాళ్లుగా భావించే అంశాల్లో అన్నిటికన్నా ముఖ్యమైంది తలసరి ఆదాయం. ఈ విషయానికి వస్తే 2023 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ మిగతా దక్షిణాది రాష్ట్రాలకన్నా ఎంతో ముందుంది. ఇక్కడ ఏడాదికి సగటు తలసరి ఆదాయం రూ.2,75, 4443గా ఉంది. రూ.2,65,623తో కర్నాటక ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. రూ.2,41,131తో తమిళనాడు, రూ.2,30, 601తో కేరళ, రూ.2,07,771తో ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. జాతీయ సగటు వార్షిక జిడిపి రూ.1,50,007తో పోలిస్తే ఈ దక్షిణాది రాష్ట్రాల సగటు తలసరి ఆదాయం ఎంతో ఎక్కువగా ఉండడం గమనార్హం. అలాగే అప్పుల విషయం చూద్దాం.

వాస్తవానికి ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల అప్పులు ఎప్పుడూ తక్కువే. ఈ రాష్ట్రాలన్నిటిలో కూడా తెలంగాణ తక్కువ అప్పులు కలిగి ఉంది. జిడిపితో పోలిస్తే తెలంగాణ అప్పుల నిష్పత్తి 25.3 శాతం మాత్రమే ఉంది. కర్నాటక అప్పుల నిష్పత్తి 27.5 శాతంగా ఉండగా, తమిళనాడు (27.7 శాతం), ఆంధ్రప్రదేశ్ (32.8 శాతం), కేరళ(37.2 శాతం) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక పన్నుల తమిళనాడు తొలి స్థానంలో ఉంది. ఈ రాష్ట్రం వార్షిక పన్నుల రాబడి రూ.1,26,644 కోట్లుగా ఉంది.రూ.1,11,494 కోట్లతో కర్నాటక రెండో స్థానంలో ఉండగా, ఈ రెండు రాష్ట్రాలకన్నా జనాభా రీత్యా, భౌగోళికంగా ఎంతో చిన్న రాష్ట్రమైన తెలంగాణ రూ.92,910 కోట్లతో మూడో స్థానంలో నిలవడం గమనార్హం.

అంతేకాదుగత తొమ్మిదేళ్లుగా ప్రతి సంవత్సరం ఈ రాబడి పెరుగుతుండడం విశేషం. ఆంధ్రప్రదేశ్ (రూ.85, 265 కోట్లు), కేరళ (రూ.71,833 కోట్లు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇక రెవిన్యూ వసూళ్లతో పోల్చినప్పుడు వడ్డీ చెల్లింపుల శాతం కూడా తెలంగాణ మిగతా దక్షిణాది రాష్ట్రాలకన్నా తక్కు శాతంలో నిలిచింది. తెలంగాణ వడ్డీ చెల్లింపుల నిష్పత్తి 11.3 శాతం మాత్రమే ఉంది. మిగతా దక్షిణాది రాష్ట్రాలకన్నా ఇది తక్కువే కావడం గమనార్హం. కర్నాటక (14.3 శాతం), ఆంధ్రప్రదేశ్(14.3 శాతం), కేరళ(18.8 శాతం) తమిళనాడు (21 శాతం) వరసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇక ఆర్థిక క్రమశిక్షణ విషయానికి వచ్చినప్పుడు కర్నాటక 2.8 శాతం తక్కువ ద్రవ్య లోటు కలిగి ఉంది. తెలంగాణ ద్రవ్య లోటు 3.9 శాతంగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News