- Advertisement -
న్యూఢిల్లీ : ఫినో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌కు ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ఆమోదం తెలిపింది. మనీ ట్రాన్స్‌ఫర్ సర్వీస్ స్కీమ్ (ఎంటిఎస్‌ఎస్) కింద అంతర్జాతీయ చెల్లింపు వ్యాపారం ప్రారంభించేందుకు గాను ఫినో బ్యాంక్‌కు ఆమోదం లభించింది. రెండు దేశాల మధ్య జరిగిన డబ్బు బదిలీ పనులను ఈ బ్యాంక్ నిర్వహించనుంది. అలాగే విదేశీ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోనుంది. 2021 నవంబర్‌లో ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన నివేదిక ప్రకారం, 2021లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా చెల్లింపులు భారత్ అందుకోనుందని, 87 బిలియన్ డాలర్లు రావొచ్చని తెలిపింది. 2022లో 3 శాతం వృద్ధితో 89.6 బిలియన్ డాలర్లు వచ్చే అవకాశముంది.
- Advertisement -