Monday, November 25, 2024

ఎయు బ్యాంక్‌తో ఫిన్‌కేర్ ఎస్‌ఎఫ్‌బి విలీనానికి ఆర్‌బిఐ ఆమోదం

- Advertisement -
- Advertisement -

ముంబై: ఎయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌తో ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఫిన్‌కేర్ ఎస్‌ఎఫ్‌బి) విలీనానికి ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) ఆమోదం తెలిపింది. ఫిన్‌కేర్ ఎస్‌ఎఫ్‌బిలో ఉన్న ప్రతి 2,000 ఈక్విటీ షేర్లకు ఎయు ఎస్‌ఎఫ్‌బిలో 579 ఈక్విటీ షేర్లను అందుకోవడానికి ఫిన్‌కేర్ ఎస్‌ఎఫ్‌బి వాటాదారులతో మొత్తం స్టాక్ విలీనం చేయనున్నారు. దేశవ్యాప్త రిటైల్ బ్యాంకింగ్ ఫ్రాంచైజీని సృష్టించడం కోసం కాంప్లిమెంటరీ జియోగ్రాఫిక్ ఫుట్‌ప్రింట్, ప్రొడక్ట్ బాస్కెట్ పై ఆధారపడి ఈ విలీనం ఉంటుంది.

ఈ విలీన సంస్థ ఇప్పుడు 1 కోటికి పైగా కస్టమర్ బేస్, 43,500 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు, 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 2,350 ఫిజికల్ టచ్‌పాయింట్‌ల నెట్‌వర్క్‌తో 2023 డిసెంబర్ నాటికి డిపాజిట్ బేస్ రూ. 89,854 కోట్లు, బ్యాలెన్స్ షీట్ పరిమాణం రూ. 1,16,695 కోట్లు కలిగి ఉంటుంది. 2023 అక్టోబర్ 29న ఎయు ఎస్‌ఎఫ్‌బి, ఫిన్‌కేర్ ఎస్‌ఎఫ్‌బి రెండింటి డైరెక్టర్ల బోర్డు విలీనాన్ని ఆమోదించింది. విలీనంపై ఎయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వ్యవస్థాపకుడు, ఎండి, సిఇఒ సంజయ్ అగర్వాల్ మాట్లాడుతూ, సంస్థపై విశ్వాసం ఉంచినందుకు ఆర్‌బిఐ చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News