Monday, December 23, 2024

ఐడిఎఫ్‌సి, ఐడిఎఫ్‌సి ఫైనాన్షియల్ హోల్డింగ్ విలీనానికి ఆర్‌బిఐ ఆమోదం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్, ఐడిఎఫ్‌సి విలీనానికి విలీనానికి ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ఆమోదం తెలిపింది. స్టాక్ మార్కెట్‌కు ఇచ్చిన సమాచారం ప్రకారం, డిసెంబర్ 18న బ్యాంక్ ఆర్‌బిఐ నుండి విలీనానికి ఆమోదం లభించింది. గతంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఈ విలీనానికి ఆమోదం తెలిపింది. సిసిఐ ప్రకారం, ఈ విలీనంలో నిర్ణయించిన నిష్పత్తి 155:100గా ఉంది. ఐడిఎఫ్‌సి 100 షేర్లకు బదులుగా ఐడిఎఫ్‌సి బ్యాంక్ మొత్తం 155 షేర్లను పొందబోతోంది. ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్‌లో ఐడిఎఫ్‌సికి మొత్తం 39.93 శాతం వాటా ఉంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తర్వాత ఇది రెండో అతిపెద్ద విలీన ఒప్పందంగా నిలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News