Wednesday, January 22, 2025

నేడు ఆర్‌బిఐలో బాండ్ల వేలం.. తెలంగాణ ఖజానాకు మరో రూ. 1000 కోట్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు మరో వెయ్యి కోట్ల రూపాయల నిధులు రానున్నాయి. ఈనెల 21వ తేదీన మంగళవారం ఉదయం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నిర్వహించే 11 రాష్ట్రాల సెక్యూరిటీ బాండ్ల వేలం నిర్వహించనుంది.

ఈ వేలంలో తెలంగాణ రాష్ట్రానికి వెయ్యి కోట్ల రూపాయల రుణాల సేకరణకు ఆర్‌బిఐ అనుమతిని మంజూరు చేసింది. వేలం ముగిసిన రోజు సాయంత్రానికే ఈ నిధులు ఖజానాలో జమా కానున్నాయి. తెలంగాణతో పాటుగా అరుణాచల్‌ప్రదేశ్ (రూ.500కోట్లు) , బీహార్ (రూ.2వేల కోట్లు), గోవా (రూ.100 కోట్లు), హర్యానా (రూ.వెయ్యి కోట్లు), జమ్ము అండ్ కాశ్మీర్ (రూ.900 కోట్లు), కర్ణాటక (రూ.1000 కోట్లు), మేఘాలయ (రూ.170 కోట్లు), నాగాలాండ్ (రూ.350 కోట్లు), పంజాబ్ (రూ.400 కోట్లు), ఉత్తర్ ప్రదేశ్ (రూ.4200 కోట్లు) రాష్ట్రాలు ఈ వేలంలో పాల్గొంటున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News