Thursday, November 21, 2024

పాత నోట్లు, నాణేలపై నకిలీ ఆఫర్లు నమ్మొద్దు

- Advertisement -
- Advertisement -
RBI cautions public against online buying and selling
హెచ్చరించిన ఆర్‌బిఐ

న్యూఢిల్లీ : పాత నాణేలు, నోట్లు విక్రయిస్తే ఎక్కువ డబ్బులు పొందవచ్చంటూ ఇటీవల ఆఫర్లు వెల్లువెత్తడంపై ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ప్రజలకు హెచ్చరికలు చేసింది. పాత నోట్లు, నాణేలను కొనడం లేదా విక్రయించేందుకు చేసే మోసపూరిత ఆఫర్‌ల బారిన పడొద్దని రిజర్వ్ బ్యాంక్ సూచించింది. ఈమేరకు సెంట్రల్ బ్యాంక్ నోటిఫికేషన్ ద్వారా ఈ సూచనలు చేసింది. ఫీజులు, కమీషన్, పన్ను డిమాండ్ చేయడానికి కొన్ని వర్గాలు మోసపూరితంగా ఆర్‌బిఐ పేరు, లోగోను ఉపయోగిస్తున్నాయనే విషయం రిజర్వ్ బ్యాంక్ దృష్టికి వచ్చింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ వేదికల ద్వారా పాత నోట్లు, నాణేల కొంటాం, విక్రయిస్తామం టూ నకిలీ ఆఫర్లు చేస్తున్నారని, వాటి బారినపడి మోసపోవద్దని ఆర్‌బిఐ హెచ్చరించిం ది. అటువంటి లావాదేవీలు నిర్వహించేందుకు ఏ సంస్థ, లేదా వ్యక్తికి గానీ అధికారం ఇవ్వలేదని ఆర్‌బిఐ పేర్కొంది. ఇలాంటి మోసపూరిత ఆఫర్ల ద్వారా మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్న, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరును దుర్వినియోగం చేస్తున్న కొన్ని వర్గాలు మోసాలకు బలికావద్దని సెంట్రల్ బ్యాంక్ సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News