- Advertisement -
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నచ్చిన కార్డు నెట్ వర్క్ కు మారేందుకు వెసులుబాటు కల్పించనుంది. క్రెడిట్, డెబిట్, ప్రీపెయిడ్ కార్డ్ వినియోగదారులకు ఈ సేవలు అక్టోబర్ 1 నుంచి అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్‌బిఐ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఆర్‌బిఐ ముసాయిదా సర్క్యులర్ జారీ చేసింది. భారత్ లో వీసా, మాస్టర్ కార్డ్, రూపే, అమెరికన్ ఎక్స్ ప్రెస్, డైనర్స్ క్లబ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. మొబైల్ నంబర్ పోర్టబిలిటీ నుండి ప్రేరణ పొంది, అక్టోబర్ 1 నుండి కార్డ్ హోల్డర్‌లు కార్డ్ నెట్‌వర్క్‌ల మధ్య సజావుగా మారడానికి ఆర్‌బిఐ అనుమతిస్తుంది.
- Advertisement -