Thursday, January 23, 2025

ద్రవ్యోల్బణంపై ఆర్‌బిఐ ఆందోళన

- Advertisement -
- Advertisement -

మరింతగా ధరలు పెరగొచ్చు
రిటైల్ ద్రవ్యోల్బణంపై డబ్లుపిఐ ఒత్తిడి ఉండనుందన్న నివేదిక

Denial of permission to auction securities bonds

 

న్యూఢిల్లీ : ధరలు మరింతగా పెరగే అవకాశముందని ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) తన నివేదికలో పేర్కొంది. అత్యధిక స్థాయిలో ఉన్న టోకు ధరల సూచీ(డబ్లుపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రిటైల్ ద్రవ్యోల్బణంపై ఒత్తిడి చూపనుందని రిజర్వు బ్యాంక్ పేర్కొంది. అధిక స్థాయిలో ఉన్న పరిశ్రమ రా మెటీరియల్ ధరల నుంచి ఒత్తిడి ఉంటుందని, అలాగే గ్లోబల్ లాజిస్టిక్స్, సరఫరా వ్యవస్థ ఇబ్బందులు కీలక ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతాయని వార్షిక నివేదికలో ఆర్‌బిఐ తెలిపింది. రష్యాఉక్రెయిన్ యుద్ధం కారణంగా చమురు రేట్లు పెరిగి వస్తువుల ధరలపై ప్రభావం ఏర్పడుతోంది.

భారత్‌లో ద్రవ్యోల్బణం పెరుగుతోంది, ప్రపంచ దేశాలపైనా ద్రవ్యోల్బణం ఎఫెక్ట్ ఉంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు వాహన ఇంధనాలపై ఎక్సైజ్ సుంకం తగ్గింపు, అలాగే స్టీల్, ప్లాస్టిక్ పరిశ్రమలో ఉపయోగించే కొన్ని ముడి పదార్థాలపై దిగుమతి సుంకాన్ని తొలగించడం వంటి అనేక చర్యలను ప్రభుత్వం ఇటీవల చేపట్టింది. ఇటీవల ప్రకటించిన గణాంకాల ప్రకారం, కూరగాయలు, వంట నూనెల ధరల పెరుగుదల కారణంగా ఏప్రిల్‌లో టోకు ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 15.08 శాతానికి పెరిగింది. అదే సమయంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల గరిష్ఠ స్థాయి 7.79 శాతానికి చేరుకుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఆర్‌బిఐ ఈ నెల ప్రారంభంలో రెపో రేటును 0.40 శాతం పెంచగా, మొత్తం రేటు 4.40 శాతానికి పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News