Sunday, January 12, 2025

సిఆర్ఆర్ తగ్గింపు, రెపో రేటు యథాతథం!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీని పెంచే ప్రయత్నంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) శుక్రవారం (డిసెంబర్ 6) నగదు నిల్వల నిష్పత్తి (సిఆర్‌ఆర్)ని 50 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) 4.5% నుండి 4 శాతానికి తగ్గించింది. సిఆర్‌ఆర్  అనేది రిజర్వ్‌గా ఆర్‌బిఐ వద్ద లిక్విడ్ క్యాష్‌లో నిర్వహించడానికి అవసరమైన బ్యాంక్ మొత్తం డిపాజిట్ల శాతం.

ఆర్ బిఐ ద్రవ్య విధాన కమిటీ(ఎంపిసి) శుక్రవారం ముంబైలో సమావేశం అయి కీలక పాలసీ రేటయిన రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. ఎలాంటి మార్పు చేయలేదు. 22 నెలలకు పైగా రెపో రేటును మార్చలేదు. ఇది వరుసగా 11వ ద్రవ్య విధానం. గమనించాల్సిన విషయం ఏమిటంటే పాలసీ ప్యానెల్ 2025 ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధి అంచనా రేటును 7.2 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గించింది.ఇక రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాను 4.5 శాతం నుంచి 4.8 శాతానికి పెంచింది.

ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ(ఎంపిసి) ద్రవ్య విధానాన్ని ‘తటస్థంగా’ కొనసాగించాలని నిర్ణయించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News