అధిక ద్రవ్యలభ్యత కోసం నగదు నిల్వ నిష్పత్తి(సిఆర్‌ఆర్) కింద పెంపుదల డిపాజిట్లలో ఎక్కువ భాగాన్ని కేటాయించాలని ఆర్‌బిఐ బ్యాంకులను ఆదేశించింది. ఈ నిర్ణయం కారణంగా ఫైనాన్ష్ షేర్లలో నష్టాలు పెరిగాయి. ద్రవ్యోల్బణం క్రమంగా లక్షంగా పరిధిలోకి వస్తుండడం, వృద్ధికి మద్దతుగా నిలవడంతో సర్దుబాటు పాలసీ విధానం నుంచి ఉపసంహరణపై ఆర్‌బిఐ దృష్టిపెట్టింది. గురువారం ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించిన నిర్ణయాల్లో ద్రవ్యోల్బణం అంచనాను స్వల్పంగా 5.4 శాతానికి పెంచారు.
టమాటాలతో పాటు పలు కూరగాయల ధరల పెరుగుదలతో సమీప భవిష్యత్‌లో ద్రవ్యోల్బణం పెరగవచ్చని చెప్పారు. అయితే ఇఎంఐ ఆధారిత ఫ్లోటింగ్ వడ్డీ రేట్లలో మార్పుకు సంబంధించిన పారదర్శకత దిశగా ఆర్‌బిఐ ప్రయత్నాలు చేస్తోంది. లోన్ల ఫోర్‌క్లోజర్ లేదా ఫిక్స్‌డ్ రేటుకు మారేందుకు రుణగ్రస్తులకు రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పిస్తోంది. యుపిఐ పేమెంట్లలో ఎఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వాడకానికి ప్రతిపాదనలు చేసింది.
బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ.2000 నోట్ల తిరిగి రాకతో పాటు వివిధ అంశాలతో మిగులు ద్రవ్యలభ్యత తెచ్చేందుకు ఆర్‌బిఐ ప్రయత్నాలు చేపట్టింది. 202324లో ఇప్పటి వరకు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల నికర ఇన్‌ఫ్లో 20.1 బిలియన్ డాలర్లు(ఆగస్టు 8 వరకు), ఇది 201415 తర్వాత అత్యధికంగా కావడంగ గమనార్హం. 2023 ఏప్రిల్‌మే కాలంలో నికర ఎఫ్‌డిఐ (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) 5.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.