- Advertisement -
న్యూఢిల్లీ: భారత రిజర్వు బ్యాంకు రూ.2వేల నోటు మార్పుకు గడువు పెంచింది. రూ.2వేల నోట్లు మార్చుకునేందుకు ఈ రోజు వరకు ఉన్న గడువును అక్టోబర్ 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఆర్ బిఐ శనివారం తెలిపింది. రూ.2వేల నోటును భారత రిజర్వు బ్యాంకు ఉపసంహరించుకుంటున్న ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే ప్రజలందరూ రూ.2వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకున్నారు.
రూ.2వేల నోట్లను సర్కులేషన్‌లో ఉంచొద్దని, వినియోగదారులకు రూ. 2వేల నోట్లు ఇవ్వడం తక్షణమే నిలిపివేయాలని ఆర్‌బిఐ బ్యాంకులను ఆదేశించింది. దేశంలో ఉన్న 19 ఆర్‌బిఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ. 2వేల నోట్లు మార్పిడి చేసుకోవచ్చు. ఒక విడుతలో రూ 20 వేలు మాత్రమే మార్చుకునే అవకాశాన్ని కల్పించింది.
- Advertisement -