Friday, December 20, 2024

హెచ్‌డిఎఫ్‌సికి ఆర్‌బిఐ రూ.5లక్షల జరిమానా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: హౌసింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌డిఎఫ్‌సి)కి రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా జరిమానా విధించింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఐదు లక్షల రూపాయల జరిమానా విధించినట్లు రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. 201920లో కొంతమంది డిపాజిటర్ల మెచ్యూర్డ్ డిపాజిట్లను వారి నిర్దేశిత బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయలేదని తనిఖీలో వెల్లడైందని ఆర్‌బిఐ ప్రకటించింది. తొలుత హెచ్‌డిఎఫ్‌సికి షోకాజ్ నోటీసు జారీ చేసింది.

నోటీసుకు కంపెనీ ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందని ఆర్‌బిఐ అనుగుణంగా లేకపోవడంతో జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది. కాగా నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బి) చేసిన హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్‌హెచ్‌బి) 2010లోని కొన్ని నిబంధనలు పాటించకపోవడంతో హెచ్‌డిఎఫ్‌సికి జరిమానా విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. అదేవిధంగా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.11.25లక్షల పెనాల్టీ విధించినట్లు రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News