Tuesday, December 24, 2024

మహేష్ బ్యాంక్‌కు భారీ జరిమానా

- Advertisement -
- Advertisement -

మహేష్ బ్యాంక్‌కు భారీ జరిమానా
రూ.65లక్షలు ఫైన్ విధించిన ఆర్‌బిఐ
సైబర్ సెక్యూరిటీపై నిర్లక్షానికి శిక్ష
మన తెలంగాణ/సిటీబ్యూరో: సైబర్ సెక్యూరిటీ విషయంలో నిర్లక్షంగా వ్యవహరించిన మహేష్ కో ఆపరేటీవ్ బ్యాంకుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ జరిమానా విధించింది. బ్యాంక్ నిరక్షం వల్లే సైబర్ నేరస్థులు ఫిషింగ్ మెయిల్స్ పంపించి రూ.12.48 కోట్లు కోట్టేశారని ఆర్‌బిఐ పేర్కొంది. దీంతో మహేష్ బ్యాంక్‌పై రూ.65లక్షల జరిమానా విధించింది. గత ఏడాది సైబర్ నేరస్థులు మహేష్ బ్యాంక్ ఉద్యోగులకు మిలీషియస్ ఈ మెయిల్స్ పంపించి బ్యాంక్ నెట్‌వర్క్‌ను హ్యాక్ చేశారు. దీంతో బ్యాంకులో ఉన్న మొ త్తం సర్వర్లు సైబర్ నేరస్థుల చేతిలోకి వెళ్లాయి.

వెంటనే నిందితులు బ్యాంక్‌లో ఉన్న రూ.12.48 కోట్ల రూపాయలను వివిధ బ్యాంక్‌లకు ట్రాన్స్‌ఫర్ చేశారు. కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేసి మహేష్ బ్యాంక్ నిర్లక్షం వల్లే సైబర్ దాడి జరిగిందని పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆర్‌బిఐకి లేఖ రాశారు, నిర్లక్షంగా వ్యవహరించిన మహేష్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేయాలని కోరారు. దీనికి స్పందించిన ఆర్‌బిఐ జరిమానా విధించింది. దేశంలో ప్రైవేట్ బ్యాంక్‌పై భారీ మొత్తంలో జరిమానా విధించడం ఇదే మొదటిసారి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News