Wednesday, January 22, 2025

రోజుకు రూ. 100 జరిమానా

- Advertisement -
- Advertisement -

ముంబై : కస్టమర్ ఫిర్యాదులను 30 రోజుల్లోగా పరిష్కరించాలని రుణదాతలు, ఆర్థిక సంస్థలు, క్రెడిట్ బ్యూరోలకు ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) తెలిపింది. అలా చేయడంలో విఫలమైతే రోజుకు రూ.100 చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుందని రిజర్వు బ్యాంక్ ప్రకటించింది. క్రెడిట్ ఇన్‌స్టిట్యూషన్స్ (సిఐ), క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ (సిఐసి) క్రెడిట్ సమాచారాన్ని అప్‌డేట్ చేయడానికి, సరిదిద్దడానికి పరిహారం ఫ్రేమ్‌వర్క్‌ను సమర్పించాలని ఆర్‌బిఐ ఆదేశించింది. దీన్ని ఆరు నెలల్లో సిద్ధం చేయాలని ఆర్‌బిఐ కోరింది.

సిఐ అప్‌డేట్ చేసిన క్రెడిట్ సమాచారాన్ని 21 రోజులలోపు సిఐసికి సమర్పించినప్పటికీ, ఫిర్యాదు 30 రోజులలోపు పరిష్కరించబడకపోతే రోజుకు 100 రూపాయల పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. సిఐసి రుణగ్రహీతలు, కార్పొరేట్లు, చిన్న వ్యాపారాల క్రెడిట్ సమాచారాన్ని నిర్వహిస్తుంది. రుణాలు మంజూరు చేసే సమయంలో లేదా అవసరమైనప్పుడు బ్యాంకులు యాక్సెస్ చేయవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News