Monday, December 23, 2024

ఆర్థిక వ్యవస్థపై ప్రభావం అంతంతే..

- Advertisement -
- Advertisement -

చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లు 10.8 శాతమే
2013-14లోనూ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నాం : ఆర్‌బిఐ గవర్నర్

న్యూఢిల్లీ : రూ.2000 నోట్ల ఉపసంహరణ ప్రభావం దేశీ య ఆర్థిక వ్యవస్థపై చాలా చాలా స్వల్పంగానే ఉంటుందని, ప్రస్తుతం చలామణిలో ఉన్న కరెన్సీలో ఈ నోట్ల వాటా 10.8 శాతం మాత్రమేనని ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. రిజర్వు బ్యాంక్ కరెన్సీ నిర్వహణలో భాగంగా ఉపసంహరణ చేపట్టిందని, సెప్టెంబర్ 30 నాటికి చాలా వరకు రూ.2000 నోట్లు తిరిగి ఖజానాకు చేరుకుంటాయని ఆశిస్తున్నామని శక్తికాంత దా స్ అన్నారు. ఈమేరకు బ్యాంకులు సిద్ధం కావాలని మార్గదర్శకాలను జారీ చేసినట్టు తెలిపారు. సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లు 10.8 శాతం మాత్రమేనని, అందువల్ల ఆ ర్థిక వ్యవస్థపై ప్రభావం చాలా చాలా స్వల్పమేనని అన్నా రు.

రూ.2 వేల నోట్లను సాధారణంగా ఎలాంటి లావాదేవీలకు వినియోగించడం లేదు, వీటి వినియోగం చాలా తక్కువగా ఉంది. దీని వల్ల ఆర్థిక కార్యకలాపాలపై ఎలాంటి ప్ర భావం ఉండదని దాస్ వివరించారు. క్లీన్ నోట్ విధానంలో భాగంగా ఆర్‌బిఐ ఎప్పటికప్పుడు కరెన్సీ నోట్ల ఉపసంహరణ పనులు చేపడుతుంది. 201314లో ఇలాంటి నిర్ణయ మే తీసుకున్నామని, 2005 సంవత్సరానికి ముందు ము ద్రించిన నోట్లను చలామణిలో నుంచి ఉపసంహరించుకున్నామని శక్తికాంత వెల్లడించారు. ఇప్పటికీ రూ.2 వేల నో ట్లు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుంది. గడువు లోగా ఎన్ని నోట్లు వస్తాయో వేచిచూస్తామని, దాని ఆధారంగా నిర్ణ యం తీసుకుంటాం, అయితే సెప్టెంబర్ 30 తర్వాత ఏం జరుగుతుందనే దానికి ఇప్పుడే ఏమీ చెప్పలేమని ఆయన అన్నారు.

తగినంతగా నోట్ల ముద్రణ
ఆర్‌బిఐ వద్దనే కాదు బ్యాంకులు నిర్వహించే కరెన్సీ చెస్ట్‌ల వద్ద కూడా ముద్రించిన నోట్లు తగినంత పరిమాణంలో ఉన్నాయని ఆర్‌బిఐ గవర్నర్ అన్నారు. సుదీర్ఘ విదేశీ పర్యటనలు లేదా వర్క్ వీసాపై విదేశాల్లో నివసిస్తున్న వారి విషయంలో సమస్యలను సున్నితంగా పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజలు నోట్లను మార్చుకునేందుకు చాలా సమయం ఉండడం వల్ల ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News