Friday, November 22, 2024

లోన్ యాప్స్‌కు ఆర్‌బిఐ కొత్త రూల్స్

- Advertisement -
- Advertisement -

RBI issues new rules for loan apps

ముంబై: మొబైల్ యాప్ నుంచి రుణాల పేరుతో జరుగుతున్న మోసాలను నివారించేందుకు ఆర్బీఐ మార్గదర్శకాలను విడుదల చేసింది. బ్యాంకులతో సహా లోన్ యాప్ నిర్వాహకులు కూడా కస్టమర్ల డేటాను స్టోర్ చేయడం, దుర్వినియోగం చేయకూడదని ఆర్బీఐ నిర్దేశించింది. నూతన మార్గదర్శకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని, నవంబర్ 30లోగా రుణసంస్థలన్నీ అమలుపరచాలిందిగా ఆర్బీఐ శుక్రవారం ప్రకటన జారీ చేసింది.నూతన మార్గదర్శకాల ప్రకారం డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫారమ్‌లు నేరుగా కస్టమర్ బ్యాంక్ ఖాతాలోకి రుణమొత్తాన్ని క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం థర్డ్‌పార్టీ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించకూడదు. లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ ఏదైనా పొరపాటు జరిగినా సదరు ఎన్‌బిఎఫ్‌సి కంపెనీ తన బాధ్యతగా పరిష్కరించాలి. వార్షికశాతం రేటు అన్ని రకాల నిధుల ఖర్చు, క్రెడిట్ ఖర్చు, నిర్వహణ వ్యయం, ప్రాసెసింగ్ రుసుము, ధ్రువీకరణ ఛార్జీలు, నిర్వహణ ఛార్జీలను కలిగి ఉంటుంది.

రుణాన్ని కొనసాగించనిపక్షంలో కస్టమరుకు కూలింగ్ అందించాలి. కాగా లోన్ ఇస్తున్న సంస్థ బ్యాంక్ ఖాతా నుంచి చెల్లింపు నేరుగా కస్టమర్ బ్యాంక్ ఖాతాలో మాత్రమే చేరుతుంది. వడ్డీ ఛార్జ్ స్టాండింగ్ లోన్ మొత్తంపై ఉంటుంది. కస్టమరు వ్యక్తిగత డేటాకు సంబంధించిన బాధ్యత రుణం ఇచ్చే సంస్థపై ఉంటుంది. అదేవిధంగా రుణం ఇచ్చే కంపెనీ కస్టమర్ లోన్ సమాచారాన్ని ఇకనుంచి క్రెడిట్ కంపెనీలతో పంచుకోవాలి. కస్టమర్ ఆమోదం లేకుండా కంపెనీ ఎటువంటి డేటా చేయకూడదని రిజర్వుబ్యాంక్ వెల్లడించింది. సమస్యల పరిష్కారానికి రుణం ఇచ్చే సంస్థ టేధుగీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్‌ను నియమించాలని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News