Monday, December 23, 2024

రెపో రేటును యథాతథంగా ఉంచిన ఆర్‌బిఐ

- Advertisement -
- Advertisement -

ముంబై: ద్రవ్యోల్బణం భరించే స్థాయికి మించిపోతున్నప్పటికీ రెపో రేటును 6.5 శాతంగా యథాతథంగా ఉంచాలని భారత రిజర్వు బ్యాంకు గురువారం నిర్ణయించింది. ఆర్‌బిఐ 2022 మే నుంచి ఆరుసార్లు పెంచి, మొత్తంగా 250 బేసిస్ పాయింట్లు పెంచిన దృష్టా ఇక పెంచకూడదని యథాతథంగా ఉంచింది. మానిటరీ పాలసీ కమిటీ(ఎంపిసి) భవిష్యత్తులో రెపో రేటుపై తొందరపాటు చర్య తీసుకోదని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ బైమంత్లీ మానిటరీ పాలసీలో ప్రకటించారు. ప్రధాన ద్రవ్యోల్బణం స్టికీగా ఉన్నందున వడ్డీ రేటు యథతథంగా ఉండనుందని ఆయన స్పష్టం చేశారు.

సాధారణంగా ప్రధాన ద్రవ్యోల్బణం వస్తువుల తయారీలోని ఇన్‌ఫ్లేషన్‌ను సూచిస్తుంది. చిల్లర ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 6.44 శాతం వద్ద ఉంది. అది అంతకు ముందు నెల 6.52 వద్ద ఉండింది. వడ్డీ రేట్లను నిర్ణయించడానికి ద్రవ్యోల్బణ సంఖ్యలను ఎంపిసి పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 5 శాతానికి తగ్గొచ్చని ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, తదితర సంస్థలు భావిస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5 శాతం ఉండగలదని, ఇది ఫిబ్రవరిలో 6.4గా ఉండిందని ఆర్బిఐ ప్రొజెక్ట్ చేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ 2023–24లో వృద్ధి రేటు 6 నుంచి 6.8 శాతం ఉండగలదని తన తాజా ఆర్థిక సర్వేలో పేర్కొంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడిచేసేందుకు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ గత నెల 25 బేసిస్ పాయింట్లను ప్రకటించింది. యూరొపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా తమ బెంచ్ మార్క్‌లను పెంచాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News