Saturday, November 23, 2024

క్లెయిమ్ చేయని డిపాజిట్లకు ‘ఉడ్గామ్’ను ప్రారంభించిన ఆర్‌బిఐ

- Advertisement -
- Advertisement -

ముంబై: వివిధ బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్‌లను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ప్రజలకు మరింత సులభతర విధానం అందించేందుకు గాను ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) గురువారం ఉడ్గామ్ (అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్స్ గేట్‌వే టు యాక్సెస్ ఇన్‌ఫర్మేషన్)ను ప్రారంభించింది. ఈ వెబ్ పోర్టల్ ద్వారా వినియోగదారులు తన కుటుంబ సభ్యులకు చెందిన వివిధ బ్యాంకుల్లోని క్లెయిమ్ చేయని డిపాజిట్ల గురించి తెలుసుకుని, సంప్రదించవచ్చు.

అలాగే ఆర్‌బిఐ ఎటువంటి ఇబ్బంది లేకుండా రుణాలు అందించడానికి పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫామ్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఆర్‌బిఐ పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ (ఆర్‌బిఐహెచ్) అభివృద్ధి చేస్తోంది. ఆగస్టు 10న సెంట్రల్ బ్యాంక్ దీనిని ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News