బంగారం రుణాలు మంజూరు గాని, పంపిణీ గాని చేయడంపై ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ సంస్థపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) సోమవారం నిషేధం విధించింది. ఇది వెంటనే అమలులోకి వచ్చింది. సంస్థ బంగారం రుణాల పోర్ట్‌ఫోలియోలో ఒకింత వస్తు పర్యవేక్షక సమస్యలను కనుగొన్న తరువాత ఆర్‌బిఐ ఈ నిషేధం విధించింది. అయితే, ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ సాధారణ సేకరణ, తిరిగి వసూలు ప్రక్రియల ద్వారా తన ప్రస్తుత బంగారం రుణాల పోర్ట్‌ఫోలియో సేవలను కొనసాగించవచ్చునని ఆర్‌బిఐ ఒక ప్రకటనలో సూచించింది. ‘బంగారం రుణాల మంజూరు లేదా పంపిణీ చేయడాన్ని, లేదా తన బంగారం రుణాలలో వేటినైనా అప్పగించడం/ సెక్యూరిటైజింగ్/ అమ్మకం జరపడాన్ని తక్షణమే విరమించాలని, అందుకు పాల్పడరాదని ఐఐఎఫ్‌ల్ ఫైనాన్స్‌ను ఆర్‌బిఐ ఆదేశించింది’ అని ఆ ప్రకటన తెలియజేసింది. ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ ఆర్థిక పరిస్థితికి సంబంధించి 2023 మార్చి 31న సంస్థలో తాను తనిఖీ జరిపినట్లు ఆర్‌బిఐ వెల్లడించింది.
బంగారం రుణాల మంజూరు వద్దు
- Advertisement -
- Advertisement -
- Advertisement -