Monday, January 20, 2025

సిబిడిసి సిస్టంలోకి మరి ఐదు బ్యాంకులు, తొమ్మిది నగరాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రిటైల్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(సిబిడిసి)లోకి మరి ఐదు బ్యాంకులు, తొమ్మిది నగరాలను చేర్చబోతున్నట్లు ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్ టి. రబి శంకర్ ఫిబ్రవరి 8న ద్రవ్య విధాన కమిటీ(ఎంపిసి) విలేకరుల సమావేశంలో తెలిపారు.
‘పైలట్‌లో 50000కంటే ఎక్కువ వినియోగదారులు, 5000 మంది వ్యాపారులు పాల్గొంటున్నారు. మాకు ఎనిమిది బ్యాంకులు ఉన్నాయి. వీటికి మరో ఐదు పెంచాలని యోచిస్తున్నాము. కాలక్రమంలో అన్ని ప్రధాన బ్యాంకులు ఈ ప్రాజెక్టులో భాగం కానున్నాయి’ అని శంకర్ చెప్పారు.

రిటైల్ సిబిడిసి కోసం పైలట్ ప్రాజెక్ట్ ఐదు నగరాల్లో ప్రారంభించాం. మరో తొమ్మిది నగరాలకు క్రమేన విస్తరించే యోచనలో ఉన్నాము. మేము వాటిని పెంచుతున్నాము అని శంకర్ తెలిపారు. ‘పైలట్’(ఆరంభం) కింద జరిగిన లావాదేవీలపై ఇప్పటి వరకు 7.70 లక్షల లావాదేవీలు జరిగాయన్నారు. ‘ ఈ లావాదేవీల మొత్తం చిన్నది, అంత ముఖ్యమైనది కాదు’ అని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News