- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడిచేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం వర్చువల్ మీటింగ్ లో ప్రకటించారు. దీంతో రెపో రేటు 4.40 శాతానికి పెరిగింది. మార్చిలో ద్రవ్యోల్బణం పెరిగిందని ఆర్‌బిఐ గవర్నర్ తెలిపారు. ద్రవ్యోల్బణం అదుపులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. వస్తు లభ్యతలో కొరత, మార్కెట్ లో ఒడుదొడుకులతో ఇబ్బందులు ఎదురయ్యాయని ఆర్‌బిఐ స్పష్టం చేసింది. ఆర్‌బిఐ ప్రకటనతో స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి కూరుకుపోయాయి. సెన్సెక్ వెయ్యి పాయింట్లు, నిఫ్టీ 250 పాయింట్లకు పైగా నష్టపోయిందని విశ్లేషకులు తెలిపారు.
- Advertisement -