Monday, January 13, 2025

తెలంగాణ దివాలా తీసిందంటున్న కాంగ్రెస్‌కు ఆర్‌బిఐ నివేదిక చెంపపెట్టు లాంటిది

- Advertisement -
- Advertisement -

కేసిఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ అన్ని రంగాలలో రికార్డు సృష్టించింది
నిజాన్ని అబద్ధంగా మార్చేందుకు రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ మంత్రుల ప్రయత్నాలు
రూ.7 లక్షల అప్పు చేశారని దుష్ప్రచారాలు చేస్తున్న కాంగ్రెస్
సంపదను పెంచి పేదలకు పంచింది కేసీఆరే
ఇచ్చిన హామీలను నేరవేర్చలేకపోయామని బిఆర్‌ఎస్ పై విషప్రచారాలు చేస్తున్న కాంగ్రెస్
అబద్దపు పునాదులపై ఏర్పడ్డ కాంగ్రెస్‌కు ప్రజల చేతుల్లో గుణపాఠం తప్పదు
తెలంగాణ అప్పుల కుప్ప అంటు రాష్ట్ర పరువును తీసింది రేవంత్‌రెడ్డియే
పేద రాష్ట్రమని అసెంబ్లీ సాక్షిగా తప్పుగా మాట్లాడిన కాంగ్రెసోళ్లు
దివాలా రాష్ట్రం కాదు దివ్యంగా వెలుగుతున్న రాష్ట్రం తెలంగాణ
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు

తెలంగాణ దివాలా తీసిందని దుష్ప్రచారాలు చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులకు ఆర్‌బిఐ నివేదిక చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నో నేరవేర్చని హమీలను ఇచ్చి అబద్దపు పునాదులపై ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పదేళ్లపాలనలో చేసిన అభివృద్ధిని జీర్ణించుకోలేక గ్లోబల్ ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు. కేసీఆర్ పేదళ్ల పాలనలో జరిగిన తెలంగాణ అభివృద్ధిపై కాంగ్రెస్ వాళ్లు చేస్తున్న ప్రచారాలు తప్పు అని దేశ ఆర్ధిక వ్యవస్ధను శాసించే ఆర్‌బిఐ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 2024కు సంబంధించిన నివేదికలో తేలిపోయిందన్నారు. కేసిఆర్ తెలంగాణను పదేళ్లలో అభివృద్ధిలో దేశానికే దిక్చూచిగా నిలపారన్నారు. తెలంగాణకు ఏడు లక్షల అప్పు ఉందని సీఎం రేవంత్‌రెడ్డితో పాలు మంత్రులు, ఆ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేయడం సిగ్గుచేటన్నారు.

బిఆర్‌ఎస్ హయాంలో తెలంగాణ అభివృద్ధి కోసం చేసిన అప్పు 3 లక్షల 22 వేల 499 కోట్లు మాత్రమేనన్నారు. గత డిసెంబర్‌లో కాంగ్రెస్ సర్కార్ విడుదల చేసిన శ్వేతపత్రం అబద్ద్ధపు పత్రమని స్పష్టమైందన్నారు. 2014-15లో తెలంగాణ మొత్తం రుణాలు 72 వేల 658 కోట్లు ఉండగా 2024 మార్చి నాటికి ఈ రుణాల మొత్తం రూపాయలు 3 లక్షల 22 వేల 499.20 కోట్లకు చేరిందని ఆర్‌బిఐ వెల్లడించిందన్నారు .అలాగే జీఎస్డీపీ 2024-25లో 4.3 లక్షల కోట్లు ఉండగా 24 నాటికి 15.01 లక్షల కోట్లు పెరిగిందని దీంతో 249 శాతంకు చేరుకుందన్నారు. తలసరి ఆదాయం పదేళ్లలో 243 శాతం పెరగగా మూలధన వ్యయం 578 శాతం , స్థాపిత విద్యుత్ సామర్ధ్యం 106 శాతం తలసరి విద్యుత్ వినియోగం 108 శాతం , సాగునీటి సదుపాయం 105 శాతం పెరిగిందన్నారు. అలాగే సాగు విస్తీర్ణం 47.74 శాతం పెరగగా ధాన్యం ఉత్పత్తి 119 శాతం ,

వైద్యంపై ప్రభుత్వ ఖర్చు 175.5 శాతం, మాంసం ఉత్పత్తి 100 శాతం, రోడ్ల పొడుగు 52.42 శాతం, అటవీ విస్తీర్ణం 266 శాతంకు పెరిగిందన్నారు. నిరుద్యోగ సమస్య 87.7కు తగ్గగా , నవజాత శిశువుల మరణాలకు 66.6 శాతంకు తగ్గిందన్నారు. ఇలా తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ద్ధి చెందిందన్నారు. కేసీఆర్ ముందు ఆలోచనతోనే రాష్ట్రం దేశానికే అభివృద్ధిలో రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు, దేవాలయాలు ,్ర పభుత్వ భవనాలు శరవేగంగా నిర్మాణాలు పూర్తి అయ్యాయని అన్నారు. కేసీఆర్ పట్టుదలతో నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా సాగు నీరు అందుతుంటే కాంగ్రెస్ ఎందుకు దీనిని ప్రచారం చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హమీలను నేరవేర్చలేమని పబ్బం గడపడానికే బిఆర్‌ఎస్‌పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హమీలను కాంగ్రెస్ నేరవేర్చేంత వరకు బిఆర్‌ఎస్ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందన్నారు. రాష్ట్రం దివాలా తీసిందని రేవంత్‌రెడ్డి చేసిన దుష్ప్రచారాలతోనే తెలంగాణకు పెట్టుబడులు రావడం లేదన్నారు.

కాంగ్రెస్ తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలతో తెలంగాణ ఆగమాగం అవుతుందన్నారు. సంపదను సృష్టించి పేదలకు పంచింది కేసీఆరేనని అన్నారు. బిఆర్‌ఎస్ పాలనలో లక్షల కోట్ల ఆస్తులు సమకూర్చుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని రాష్ట్ర పరపతిని, పరువును దిగజార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసెంబ్లీ సాక్షిగా తెలంగాణ పేద రాష్ట్రమని కాంగ్రెసోళ్లు చెప్పడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ అబద్ద్ధపు ప్రచారాలను మానుకోకుంటే ప్రజల చేతుల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు కడవేర్గు రాజనర్సు, వేలేటి రాధాకృష్ణ శర్మ, పాల సాయిరాం, కొండం సంపత్‌రెడ్డి, గుండు భూపేశ్, మోయిస్,నాగరాజురెడ్డి, మల్లికార్జున్, సయిద్, శ్రీనివాస్, సాయిగౌడ్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News