Thursday, January 23, 2025

సింగిల్ టేక్‌లో 80 సెకన్ల స్టెప్!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇటీవల రామ్ చరణ్, -ఎన్టీఆర్ కలిసి నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని ‘నాటు నాటు..’ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆస్కార్ అవార్డు కోసం ఈ పాట పోటీ బరిలో నిలిచింది. తుది నామినీల్లో నిలిచిన ఈ పాట ఆస్కార్ ని తెచ్చేస్తుందని అంతా ఆశిస్తున్నారు. ముఖ్యంగా ఈ పాటలో తారక్‌తో కలిసి రామ్‌చరణ్ స్టెప్పు వేసిన తీరు, సుదీర్ఘ సమయం సింగిల్ టేక్ స్టెప్ తో ఆశ్చర్యపరిచిన వైనం ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఇదిలా ఉండగా రామ్‌చరణ్ మరోసారి ప్రయోగాత్మక స్టెప్‌తో సెట్లో వీక్షకులకు షాకిచ్చాడు.

చరణ్ 1.20 నిమిషాల (80 సెకన్ల) నిడివి గల సింగిల్ టేక్ స్టెప్ వేసి దర్శకుడు శంకర్ సహా ‘ఆర్‌సి 15’ యూనిట్ మొత్తాన్ని ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విశాఖపట్నం- సింహాచలంలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు, ఒక పాటను చిత్రీకరించారు. పాట చిత్రీకరణ సమయంలో చరణ్ ఒకే టేక్‌లో 80 సెకన్ల నిడివి గల డ్యాన్స్ స్టెప్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. నవంబర్‌లో న్యూజిలాండ్‌లో సుదీర్ఘ షెడ్యూల్ జరిగింది. అక్కడ ఒక పాటను చిత్రీకరించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News