Friday, February 21, 2025

‘ఆర్‌సి 16’ వచ్చేది అప్పుడేనా?

- Advertisement -
- Advertisement -

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న స్పోర్ట్ డ్రామా ‘ఆర్‌సి 16’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కూడా ఈ ఏడాది లోనే ఉంటుంది అని ఇప్పటికే పలు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ రిలీజ్ డేట్‌ని కూడా మేకర్స్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 16న థియేటర్స్‌లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను వృద్ధి సినిమాస్, మైత్రిమూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News