Monday, January 20, 2025

త్వరలో ‘ఆర్‌సి 16’ రెగ్యులర్ షూటింగ్

- Advertisement -
- Advertisement -

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ‘గేమ్ ఛేంజర్’ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక దీని అనంతరం ఇప్పటికే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనతో తన నెకస్ట్ మూవీ అయిన ఆర్‌సి 16 మావీని ప్రకటించారు చరణ్.

వ్రిద్ది సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మాణంలో వెంకట సతీష్ కిలారు ఈ మూవీని గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియన్ రేంజ్‌లో నిర్మించనుండగా ఏ ఆర్ రహమాన్ సంగీతం అందించనున్నారు. రూరల్ స్పోరట్స్ యాక్షన్ డ్రామా మూవీగా ఆకట్టుకునే కథ కథనాలతో ఈ మూవీ రూపొందనున్నట్లు తెలిసింది. ఇక ఈ మూవీకి భారీ బడ్జెట్ ని కేటాయించనున్నారట మేకర్స్. ఇక త్వరలో ఈ క్రేజీ ప్రాజెక్టు రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News