దుమ్ము రేపిన బౌలర్లు
ముంబయిపై ఆర్‌సిబి ఘన విజయం
దుబాయి: ఐపిఎల్‌లో భాగంగా దుబాయి వేదికగా జరిగిన మరో మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ, మ్యాక్స్‌వెల్‌లు రాణించగా, బౌలింగ్‌లో హర్షల్ పటేల్ హ్యాట్రిక్ సాధించడంతో కోహ్లీ సేన 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బెంగళూరు బౌలర్లు చెలరేగడంతో ఆ జట్టు నిర్దేశించిన 166 పరుగుల లక్షాన్ని ఛేదించడంలో ముంబయి ఇండియన్స్ ఆదినుంచి చివరిదాకా తడబడుతూనే ఏచ్చింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (43), క్వింటన్ డికాక్(24)తప్ప మరెవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేదు. దీంతో ఆ జట్టు 111 పరుగులకే ఆలవుట్ అయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 17వ ఓవర్ తొలి బంతికి హార్దిక్ పాండ్యను పెవిలియన్‌కు పంపిన హర్షల్ పటేల్ ఆ తర్వాత వరస బంతులకు కీరన్‌పోలార్డ్, రాహుల్ చాహర్‌ను కూడా ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (42 బంతుల్లో 3 ఫోర్లు, మరో మూడు సిక్స్‌లతో 51), మ్యాక్స్‌వెల్ (37 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 56 పరుగులు) అర్ధ సెంచరీలతో రాణించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. బుమ్రా వేసిన రెండో ఓవర్‌లో ఓపెనర్ పడిక్కల్(0) వికెట్‌ను కోల్పోయింది. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శ్రీకర్ భరత్ కోహ్లీకి అండగా నిలిచాడు. బుమ్రా వేసిన నాలు గో ఓవర్‌లో కోహ్లీ ఓ సిక్స్, మరో ఫోర్ బాదగా, శ్రీకర్ బౌండరీ కొట్టాడు. దీంతో ఆ ఓవర్‌లో 16 పరుగులు వచ్చాయి. అనంతరం ఆడమ్ మిల్నే వేసిన ఓవర్‌లో కోహ్లీ మరో సిక్స్, ఫోర్ బాదాడు. శ్రీకర్‌ను చాహర్ పెవిలియన్‌కు పంపాడు. శ్రీకర్ 32 పరుగులు చేశాడు. కోహ్లీ ఔటయిన తర్వాత మ్యాక్స్‌వెల్ జోరు పెంచాడు. మిల్నే వేసిన 18వ ఓవర్‌లో ఓ సిక్స్, రెండు ఫోర్లు కొట్టాడు. అయితే తర్వాతి ఓవర్‌లో బుమ్రా కోహ్లీ, డివిలియర్స్(11)ను వరస బంతుల్లో పెవిలియన్‌కు పంపించడమే కాకుండా ఆరు పరుగులే ఇచ్చాడు. బౌల్ట్ వేసిన చివరి ఓవర్‌లో షాబాబ్ అహ్మద్(1) ఔటయ్యాడు.
RCB Beat MI by 54 runs in IPL 2021