- Advertisement -
ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ సీజన్‌లో ఆర్‌సిబి జట్టు దూకుడుగా ఆడుతోంది. ప్రతి విభాగంలో పటిష్టంగా రాణిస్తూ.. పాయింట్ల పట్టికలో మొదటిస్థానంలో నిలిచింది. అయితే ఈ క్రమంలోనే ఆర్‌సిబి ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటివరకూ టోర్నమెంట్‌లో పది మ్యాచులు ఆడిన ఆర్‌సిబి 7 మ్యాచ్‌లలో విజయం సాధించింది. అందులోనూ ఆరు ప్రత్యర్థి మైదానంలో సాధించిన విజయాలే. ఇలా గతంలో ఏ జట్టు సాధించలేదు. దీంతో ఎవరూ సాధించలేని రికార్డు సాధించి ఆర్‌సిబి తనకు తానే సాటి అని నిరూపించుకుంది. ఇక ప్రస్తుతం 14 పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్నా ఆర్‌సిబి.. మిగిలిన నాలుగు మ్యాచుల్లో ఇంకో మ్యాచ్ గెలిస్తే.. ప్లేఆఫ్స్‌కి వెళ్లిపోతుంది. ఆర్‌సిబి తదుపరి మ్యాచుల్లో చెన్నై, లక్నో, హైదరాబాద్, కోల్‌కతాతో తలపడనుంది.
- Advertisement -