బెంగళూరు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సొంత మైదానం చిన్నస్వామి స్టేడియం కలిసి రావడంలేదు. ఈ ఐపిఎల్‌లో ఆడిన రెండు మ్యాచ్‌లలలో ఆర్‌సిబి ఓటమిని చవిచూసింది. గురువారం ఆర్‌సిబి, డిసికి మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు ఘన విజయం సాధించింది. దీంతో ఆర్‌సిబి జట్టు చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తన సొంత మైదానంలో 44 సార్లు ఓడిపోగా ఇప్పుడు ఆర్‌సిబి జట్టు 45 సార్లు ఓడిపోవడంతో ఆ రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
మ్యాచ్ అనంతరం ఆర్‌సిబి కెప్టెన్ రజత్ పటీదార్ మీడియాతో మాట్లాడారు. తాము బ్యాటింగ్ చేసే టప్పుడు పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా మారిందన్నాడు. తాము ప్రారంభంలో పిచ్‌ను గమనించిప్పుడు బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని భావించాం కానీ చివరలో మాత్రం బ్యాటింగ్ చేయడం కష్టంగా మారిందని వెల్లడించారు. నెక్ట్స్ మ్యాచ్‌లో తాము చేసిన తప్పులను సరిదిద్దుకుంటామని వివరణ ఇచ్చాడు. టిమ్ డేవిడ్ ఆఖర్లో ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడని ప్రశంసించారు. పవర్ ఫ్లేలో తమ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని కొనియాడారు. సొంత, బయట రికార్డుల గురించి తాను పట్టించుకోను అని, నాణ్యమైన క్రికెట్ ఆడేందుకు మా జట్టు ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నాడు.