Sunday, December 22, 2024

బెంగళూరుకు మళ్లీ నిరాశే

- Advertisement -
- Advertisement -

ఈసారి కూడా ఛాలెంజర్స్‌కు ట్రోఫీ అందని ద్రాక్షే!
అహ్మదాబాద్: ఐపిఎల్‌లో ఎలాగైన ట్రోఫీని సాధించాలని భావించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మళ్లీ నిరాశే మిగిలింది. ఈసారి కూడా బెంగళూరు కల చెదిరింది. మరోసారి కప్పు లేకుండానే ఇంటిదారి పట్టింది. వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలవడంతో బెంగళూరుపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఆరంభంలో వరుస ఓటములతో సతమతమైన ఛాలెంజర్స్ ఆ తర్వాత అసాధారణ ఆటతో చెలరేగి పోయింది. ఒకదాని వెంట ఒక మ్యాచ్‌లో గెలుస్తూ టోర్నీలో పెను ప్రకంపనలు సృష్టించింది. ఈ క్రమంలో అందరి అంచనాలను తారుమారు చేస్తూ ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. కానీ రాజస్థాన్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో జట్టుకు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో ఈసారి కూడా బెంగళూరు ఐపిఎల్ కల చెదిరిపోయింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు ఆశించిన స్థాయిలో రాణించలేక పోయింది. దీంతో జట్టుకు ఓటమి ఎదురైంది. ఎలిమినేటర్‌లో గెలిచి ఫైనల్ రేసులో నిలువాలని భావించిన జట్టుకు నిరాశే మిగిలింది. కీలకమైన ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యం జట్టును వెంటాడింది. రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌ను చేయడంతో బెంగళూరు తక్కువ స్కోరుకే పరిమితమైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ కాస్త చెమటోడ్చి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు బెంగళూరు చివరి వరకు గట్టిగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఎలిమినేటర్‌లో ఓడడంతో ఛాలెంజర్స్ ఈసారి కూడా వట్టి చేతులతో ఇంటిదారి పట్టక తప్పలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News