Wednesday, January 22, 2025

ట్రావిస్ హెడ్‌ వీక్ నెస్ కనిపెట్టిన బెంగళూరు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సిబి ఘన విజయం సాధించింది. హైదరాబాద్ ఆటగాడు ట్రావిస్ హెడ్ దూకుడగా ఆడడంతో ఆ జట్టు విజయాలను సాధిస్తోంది. దీంతో ట్రావిస్ హెడ్‌కు చెక్ పెట్టి విజయం సాధించాలని ఆర్‌సిబి వ్యూహత్మకంగా ముందుకు వెళ్లి గెలుపొందింది. ట్రావిస్ పాస్ట్ బౌలింగ్‌లో ధనా ధన్ బ్యాటింగ్ చేస్తుండడంతో స్పిన్నర్ ను బరిలోకి దించింది. తొలి ఓవర్ ఆఫ్ స్పిన్నర్ విల్ జాక్సన్ రంగంలోకి దించి హెడ్ వికెట్ తీసింది. ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ గత కొన్ని రోజులగా స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడుతున్నాడు.

ఐపిఎల్ 2024లో స్పిన్నర్ల బౌలింగ్‌లో 150 స్ట్రైక్ రేటుతో 15.75 సగటుతో 63 పరుగులు చేయగగా పాస్ట్ బౌలింగ్‌లో 87.33 సగటు, 236 పైగా స్ట్రైక్ రేటుతో 262 పరుగులు చేశాడు. అతడు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ కావడంతో పాస్ట్ బౌలింగ్‌లో మూడు సార్లు ఔటయ్యాడు. వేగంగా వచ్చే బంతులను అద్భుతంగా ఆడుతున్నాడని క్రికెట్ పండితులు చెబుతున్నారు. అతడి స్పిన్ వీక్‌నెస్‌ను ఆర్‌సిబి పట్టుకొని హెడ్ వికెట్ తీసింది. ఈ ఐపిఎల్ లో ఇప్పటివరకు హెడ్ 325 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News