ఐపిఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓ చెత్త రికార్డు నెలకొల్పింది. శుక్రవారం రాత్రి పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు ఓటమిపాలు కావడంతో చెత్త రికార్డ్ మూటగట్టుకుంది. హోంగ్రౌండ్‌లో 46 మ్యాచులు ఓడిన తొలి జట్టుగా బెంగళూరు నిలిచింది. గతంతో ఈ రికార్డ్ ఢిల్లీ పేరిట ఉండేది. ఆ జట్టు అరుణ్‌జైట్లీ స్టేడియంలో 45 మ్యాచులు ఓడింది. కాగా, చిన్నస్వామి స్టేడియం చాలా చిన్నది కావడం ఆర్సీబి జట్టుకు పెద్ద మైనస్ గా మారింది. ఎంత పెద్ద స్కోరు చేసినా కాపాడుకోలేకపోతోంది. గతంతోనూ భారీ స్కోర్లు చేసినా.. బెంగళూరు డిఫెండ్ చేసుకోలేక చాలా మ్యాచ్‌లు ఓడిపోయిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాగా, మ్యాచ్ విషయానికి వస్తే.. బెంగళూరుపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం సాధించింది.. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 14 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. అనంతరం 96 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 12.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసి గెలుపొందిందవి.