Saturday, November 23, 2024

బెంగళూరుకు షాక్.. ఓపెనర్ పడిక్కల్‌కు కరోనా

- Advertisement -
- Advertisement -

ముంబై: ఐపిఎల్ ఆరంభానికి ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు గట్టి షాక్ తగిలింది. యువ ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలింది. దీంతో బెంగళూరు శిబిరంలో కలవరం నెలకొంది. ప్రస్తుతం పడిక్కల్ ఐసోలేషన్‌లో ఉన్నట్టు సమాచారం. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రంలో అతను చికిత్స తీసుకుంటున్నట్టు ఫ్రాంచైజీకి చెందిన ఓ అధికారి వెల్లడించాడు. ఇక ఐపిఎల్ ఆరంభానికి ముందే కరోనా కల్లోలం పెను ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కరోనా బారిన పడ్డాడు. అంతేగాక ఇప్పటి వరకు మరో 20మంది వరకు సహాయక సిబ్బందికి కరోనా సోకింది.

తాజాగా పడిక్కల్‌కు కూడా కరోనా పాజిటివ్ రావడంతో ఆందోళన మరింత పెరిగింది. ఇదిలావుండగా కరోనాకు గురి కావడంతో పడిక్కల్ ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం కష్టంగా మారింది. బెంగళూరు శుక్రవారం తన తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. కానీ పడిక్కల్ కరోనా బారిన పడడంతో బెంగళూరుకు పెద్ద ఎదురుదెబ్బగా చెప్పొచ్చు.ఇటీవల ముగిసిన ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే టోర్నమెంట్‌లలో పడిక్కల్ నిలకడైన ప్రదర్శన కనబరిచాడు. అంతేగాక దుబాయి వేదికగా జరిగిన కిందటి ఐపిఎల్ సీజన్‌లో అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు.

RCB Opener Padikkal test positive for Covid 19

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News