Monday, March 24, 2025

ఆర్‌సిబి టార్గెట్ 175

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: ఐపిఎల్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన టి20 మ్యాచ్‌లో కెకెఆర్ జట్టు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ఆర్‌ఎసి ముందు 175 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కెకెఆర్ కెప్టెన్ అజింక్య రహానే 31 బంతుల్లో 56 పరుగులు చేసి పర్యాలేదనిపించాడు. సునీల్ నరైన్ 26 బంతుల్లో 44 పరుగులు చేశారు. కెకెఆర్ బ్యాట్స్‌మెన్లలో అంగ్‌క్రిష్ రఘువంశీ (30), రింకు సింగ్(12) పరుగులు చేసి ఔటయ్యారు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు సింగల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆర్‌సిబి బౌలర్లలో కృనాల్ పాండ్యా మూడు వికెట్లు తీయగా జోష్ హజిల్‌వుడ్ రెండు వికెట్లు, యశ్ దయాల్, రషిక్ దర్ సలామ్, సుయాశ్ శర్మ తలో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News