- Advertisement -
బెంగళూరు: ఐపిఎల్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్ కింగ్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగి టి 20 మ్యాచ్‌లో పంజాబ్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. బెంగళూరు ముందు 177 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ ఉంచింది. చివరలో శషాంక్ సింగ్, జితేశ్ శర్మ మెరుపులు మెరిపించారు. పంజాబ్ బ్యాట్స్‌మెన్లలో శిఖర్ ధావన్(45),జతేశ్ శర్మ(27), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(25), శ్యామ్ కరన్(23), లివింగ్‌స్టోన్(17), శశాంక్ సింగ్(21) నాటౌట్, హర్‌ప్రీత్ బ్రార్ (02) నాటౌట్ పరుగులు చేసి ఔటయ్యారు. బెంగళూరు బౌలర్లలో గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్ చెరో రెండు వికెట్లు, యశ్ దయాల్, అల్జారీ జోషెఫ్ చెరో ఒక వికెట్ తీశారు.
- Advertisement -