Monday, December 23, 2024

సమరోత్సాహంతో బెంగళూరు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : ఐపిఎల్‌లో భాగంగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సమరోత్సాహంతో సిద్ధమైంది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి బెంగళూరు జోరుమీదుంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ఆరంభ మ్యాచుల్లో వరుస ఓటములు చవిచూసిన బెంగళూరు ఆ తర్వాత అసాధారణ ఆటతో చెలరేగి పోతోంది. వరుస విజయాలతో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లోనూ గెలుపుపై కన్నేసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఛాలెంజర్స్ సమతూకంగా కనిపిస్తోంది. కోహ్లి, కెప్టెన్ డుప్లెసిస్, రజత్ పటిదార్, దినేశ్ కార్తీక్ తదితరులు జోరుమీదున్నారు. బౌలర్లు కూడా బాగానే రాణిస్తున్నారు. ఇక ఢిల్లీకి ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ రిషబ్‌పై ఒక మ్యాచ్ నిషేధం విధించారు. దీంతో అతను లేకుండానే ఢిల్లీ బరిలోకి దిగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News