బెంగళూరు: ఐపిఎల్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ జట్టుపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. కోహ్లీ, దేవ్ దూత్ పడిక్కల్ హాఫ్ సెంచరీలతో చేయడంతో గెలుపొందారు. చివరలో 11 పరుగుల తేడాతో గెలిచారు. చిన్న స్వామి స్టేడియలో మూడు మ్యాచ్ లు ఓటమి అనంతం నాలుగో మ్యాచ్ లో విజయం సాధించారు. 200 పరుగులు పైగా సాధిస్తే విజయం సాధించవచ్చని తొలుత భావించామని విరాట్ కోహ్లీ తెలిపారు. విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడారు. రాజస్థాన్ ఆరంభం చూసిన తరువాత ఇంకా కొన్ని పరుగులు చేస్తే బాగుండునని తెలిపాడు.
ఆర్ సిబి సరైన సమయంలో వికెట్లు తీయడంతో తమ జట్టు విజయం సాధించందన్నారు. ఫ్లాన్ ప్రకారం క్రీజులోకి వచ్చామని, ఒకరు దూకుడు ఆడితే మరొకరు స్ట్రైకింగ్ ఇచ్చామని పేర్కొన్నారు. పిచ్ ఎలా స్పందిస్తుందో ముందే తెలుసు కావునా ఎటాకింగ్ చేశామని కోహ్లీ వివరించారు. త్వరగా వికెట్లు కోల్పోతే ఇన్నింగ్స్ పునర్ నిర్మాణం చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పషం చేశారు. ఈ పిచ్ లో తొలి నాలుగు ఓవర్లు ఎక్కువగా పేస్ బౌన్స్ ఉండడంతో షాట్లు కొట్టకుండా ఖాళీల్లోకి బంతి పంపించి పరుగులు తీశామన్నారు. తరువాత బౌండరీలు రాబడుతూ రాజస్థాన్ జట్టుపై ఒత్తిడి పెంచామన్నారు.