Saturday, November 23, 2024

బెంగళూరుకు చావోరేవో

- Advertisement -
- Advertisement -

 నేడు సన్‌రైజర్స్‌తో పోరు

బెంగళూరు: వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే పోరు చావోరేవోగా మారింది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు కేవలం ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించింది. ఐదు మ్యాచుల్లో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఇక హైదరాబాద్ ఆడిన ఐదు మ్యాచుల్లో మూడు విజయాలు సాధించిన నాలుగో స్థానంలో కొనసాగుతోంది. కిందటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించడం సన్‌రైజర్స్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యంది. బెంగళూరుపై కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే లక్షంతో పోరుకు సిద్ధమైంది. ఇక సొంత గడ్డపై జరుగుతున్న పోరులో ఎలాగైనా విజయం సాధించి మళ్లీ గాడిలో పడాలనే లక్షంతో బెంగళూరు ఉంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగే అవకాశాలున్నాయి.

సవాల్ వంటిదే..
ఇక ఆతిథ్య బెంగళూరుకు ఈ మ్యాచ్ సవాల్ వంటిదేనని చెప్పాలి. ఈ సీజన్‌లో బెంగళూరు ఆశించిన స్థాయిలో రాణించలేక పోతోంది. ఐదు మ్యాచుల్లో ఓడడంతో జట్టు తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయింది. ఇలాంటి స్థితిలో సన్‌రైజర్స్ వంటి బలమైన జట్టును ఓడించాలంటే సర్వం ఒడ్డి పోరాడక తప్పదు. అయితే కీలక ఆటగాళ్లు విఫలమవుతుండడం బెంగళూరుకు ప్రతికూలంగా మారింది. విరాట్ కోహ్లి, దినేశ్ కార్తీక్‌లు మాత్రమే నిలకడైన ఆటను కనబరుస్తున్నారు. మిగతా బ్యాటర్లు పూర్తిగా నిరాశ పరుస్తున్నారు. కెప్టెన్ డుప్లెసిస్ కూడా తన స్థాయికి తగ్గ ఆటను కనబరచడంలో విఫలమవుతున్నాడు. ముంబైతో జరిగిన కిందటి మ్యాచ్‌లో మాత్రమే డుప్లెసిస్ కాస్త మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. స్టార్ ఆటగాడు మ్యాక్స్‌వెల్ అత్యంత చెత్త ఆటతో నిరాశ పరుస్తున్నాడు. అతని వైఫల్య జట్టుకు ప్రతికూలంగా మారింది. బ్యాట్‌తో, బంతితో జట్టును ఆదుకోవడంలో మ్యాక్స్‌వెల్ వైఫల్యం చవిచూస్తున్నాడు.

కనీసం ఈ మ్యాచ్‌లోనైనా అతను తన ఆటను మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఉంది. రజత్ పటిదార్, విల్ జాక్స్, మహిపాల్ లొమ్రుర్ తదితరులు పెద్దగా ప్రభావం చూపలేక పోతున్నారు. బౌలింగ్‌లోనూ బెంగళూరుకు ఇబ్బందులు తప్పడం లేదు. ముంబైతో జరిగిన కిందటి మ్యాచ్‌లో బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. 197 పరుగుల క్లిష్టమైన లక్ష్యాన్ని ముంబై 15.3 ఓవర్లలోనే ఛేదించింది. దీన్ని బట్టి బెంగళూరు బౌలర్లు వైఫల్యం ఎలా ఉందో ఊహించుకోవచ్చు. సిరాజ్, ఆకాశ్‌దీప్, మ్యాక్స్‌వెల్, టోప్లే, విజయ్‌కుమార్ వైశాఖ్, విల్ జాక్స్ తదితరులు పూర్తిగా విఫలమవుతున్నారు. రెండు విభాగాల్లోనూ బలహీనంగా మారడంతో బెంగళూరుకు వరుస ఓటములు తప్పడం లేదు. ఇలాంటి స్థితిలో హైదరాబాద్‌తో పోరు జట్టుకు సవాల్‌గా మారింది.

విజయమే లక్ష్యంగా..
మరోవైపు సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఈ సీజన్‌లో హైదరాబాద్ కాస్త మెరుగైన ప్రదర్శన చేస్తుందనే చెప్పాలి. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మార్‌క్రమ్, నితీష్ రెడ్డి, రాహుల్ త్రిపాఠి, సమద్, షాబాజ్ అహ్మద్ తదితరులతో హైదరాబాద్ బ్యాటింగ్ బలంగా ఉంది. అభిషేక్, మార్‌క్రమ్, హెడ్, క్లాసెన్‌లు నిలకడైన బ్యాటింగ్‌తో జట్టును ఆదుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. కిందటి మ్యాచ్‌లో యువ ఆటగాడు నితీష్ రెడ్డి విధ్వంసక బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలిచా డు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. బౌలింగ్‌లోనూ హైదరాబాద్ మెరుగైన ప్రదర్శన చేస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌కు గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News