Friday, April 4, 2025

హ్యాట్రిక్‌పై బెంగళూరు కన్ను

- Advertisement -
- Advertisement -

నేడు గుజరాత్‌తో పోరు

బెంగళూరు: ఐపిఎల్ సీజన్ 2025లో వరుస విజయాలతో అలరిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బుధవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగే పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ పోరులో గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బెంగళూరు సమతూకంగా ఉంది.

ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు జట్టులో ఉన్నారు. పటిష్టమైన చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 50 పరుగులతో జయకేతనం ఎగుర వేసింది. అంతకుముందు తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతాను కూడా చిత్తుగా ఓడించింది. తాజాగా గుజరాత్‌తో జరిగే పోరులో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. ఓపెనర్లు విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్ ఫామ్‌లో ఉన్నారు. రెండు మ్యాచుల్లోనూ వీరు శుభారంభం అందించారు.

ఇక కెప్టెన్ రజత్ పటిదార్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తున్నాడు. లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, దేవ్‌దుత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, కృనాల్ పాంత్య తదితరులతో బెంగళూరు బ్యాటింగ్ బలంగా ఉంది. దీనికి తోడు సొంత గడ్డపై ఆడుతుండడం జట్టుకు మరింత కలిసివచ్చే అంశంగా చెప్పాలి. ఇక ముంబై ఇండియన్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో గెలిచిన గుజరాత్ ఈ పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. బెంగళూరును కూడా ఓడించాలనే పట్టుదలతో కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News