జైపూర్: ఐపిఎల్ 18వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సవాయి మాన్‌సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సిబి బ్యాటర్లు చెలరేగిపోయారు. రాజస్థాన్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బౌండరీల వర్షం కురిపించారు. ఫిలిప్ సాల్ట్(65, 33 బంతుల్లో, 5 ఫోర్లు, 6 సిక్సులు), విరాట్ కోహ్లీ (62 నాటౌట్, 45 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సులు), దేవ్‌దత్ పడిక్కల్(40 నాటౌట్, 28 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సు) రాజస్థాన్ బౌలర్లపై తమ బ్యాటింగ్ ప్రతాపం చూపించారు. ఫలితంగా ఆర్‌సిబి 17.3 ఓవర్లలో కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి 175 పరుగులతో ఈ మ్యాచ్‌లో ఘన విజయాన్ని సాధించింది.
అదరగొట్టిన బ్యాటర్లు.. ఆర్‌సిబి ఘన విజయం
- Advertisement -
- Advertisement -
- Advertisement -