Monday, December 23, 2024

ఢిల్లీపై గెలిచిన బెంగళూరు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఐపిఎల్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. డిసిపై ఆర్‌సిబి 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆర్‌సిబి తొలుత బ్యాటింగ్ చేసి డిసి ముందు 175 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. డిసి జట్టు ఓపెనర్లతో పాటు మిడిల్ ఆర్డర్ విఫలం కావడంతో 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 151 పరుగులు మాత్రమే చేసి ఓటమిని చవిచూసింది. మనీష్ పాండే హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు. ఢిల్లీ బ్యాట్స్‌మెన్లు మనీష్ పాండే(50), డేవిడ్ వార్నర్ (19), అక్షర పటేల్(21), అమన్ హకీమ్ ఖాన్ (18), లలిత్ యాదవ్ (04), అన్రిచ్ నోర్ట్ (23 నాటౌట్), అభిషేక్ పోరెల్ (05), యశ్ దుల్ (01), కుల్దీప్ యాదవ్ (07 నాటౌట్) పరుగులు చేశారు. పృద్ద్వీ షా, మిచెల్ మార్ష్ డకౌట్ రూపంలో వెనుదిరగడంతో ఢిల్లీ జట్టుకు దెబ్బ పడింది. ఆర్‌సిబి బౌలర్లలో విజయ్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా మహ్మాద్ సిరాజ్ రెండి వికెట్లు తీయగా పార్నెల్, వన్నిడ్ హసరంగా, హర్షల్ పటేల్ తలో ఒక వికెట్ తీశారు.

Also Read: పవన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి షెడ్యూల్ పూర్తి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News