Monday, March 24, 2025

బెంగళూరు బోణీ

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: ఐపిఎల్ సీజన్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శుభారంభం చేసింది. శనివారం ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో బెంగళూరు ఏడు వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఓపెనర్ సునీల్ నరైన్, కెప్టెన్ అజింక్య రహానె అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. విధ్వంసక ఇన్నిం గ్స్ ఆడిన రహానె 31 బంతుల్లోనే ఆరు ఫోర్లు, 4 సిక్సర్లతో 56 పరుగులు చేశా డు. నరైన్ 26 బంతుల్లోనే 3 సిక్స్‌లు, ఐదు బౌండరీలతో 44 పరుగులు సాధించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 16.2 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (56), కోహ్లి 59(నాటౌట్), కెప్టెన్ పటిదార్ (34), లివింగ్‌స్టోన్ 15 (నాటౌట్) జట్టును గెలిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News