ముంబై: ఐపిఎల్‌లో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. తొలుత బ్యాటిం గ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఓపెనర్ విరాట్ కోహ్లి 42 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 67 పరుగులు చేశాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రజత్ పటిదార్ 32 బంతుల్లోనే 4 సిక్స్‌లు, ఐదు ఫోర్లతో 64 పరుగులు సాధించాడు.
లివింగ్‌స్టోన్ మరోసారి నిరాశ పరిచాడు. అతను ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఇక వికెట్ కీపర్ జితేశ్ శర్మ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. 19 బంతుల్లోనే 4 సిక్సర్లు, రెండు ఫోర్లతో 40 పరుగులు చేసి అజేయంగా నిలిచా డు. తర్వాత భారీ లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. కెప్టెన్ హార్దిక్ పాండ్య 15 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42, తిలక్ వర్మ 29 బంతుల్లోనే 4 ఫోర్లు, నాలుగు బౌండరీలతో 56 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. బెంగళూరు బౌలర్లు కీలక సమయంలో వికెట్లు తీసి జట్టుకు విజయం సాధించి పెట్టారు.