Wednesday, January 22, 2025

పంజాబ్‌పై బెంగళూరు గెలుపు…

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఐపిఎల్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో ఆర్ సిబి గెలుపొందింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 19.2 ఆరు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను పూర్తి చేసింది. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. విరాట్ 49 బంతుల్లో 77 పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్‌లో హర్‌ప్రీత్ బ్రార్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. చివరలో దినేష్ కార్తీక్(28), మహిపాల్ లిమ్రోర్(17) మెరుపులు మెరిపించడంతో గెలుపొందారు. పంజాబ్ బౌలర్లలో కగిసో రబడా, హర్‌ప్రీత్ బ్రార్ చెరో రెండు వికెట్లు తీయగా శ్యామ్ కరణ్, హర్షల్ పటేల్ చెరో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News