Tuesday, April 15, 2025

భళా బెంగళూరు

- Advertisement -
- Advertisement -

జైపూర్: ఐపిఎల్ 18వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జోరుకొనసాగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతోంది. సొంతగడ్డపై ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన బెంగళూరు 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. పర్యావరణ పరిరక్షణ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ మ్యాచ్‌నులో గీన్ అండ్ గ్రీన్ జెర్సీలో బరిలోకి దిగిన బెంగళూరు ఐదో విజయాన్ని సాధించి, తన రికార్డ్‌ను మరింత మెరుగుపరుచుకుంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ నిర్ధేశించిన 174 పరగుల లక్ష ఛేదనకు దిగిన బెంగళూరు 17.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 175 పరుగులు చేసి గెలుపొందింది. ఫిల్ సాల్ట్ 65 (33 బంతులు: 5×4, 6×6) హాఫ్ సెంచరీలతో వీరవిధ్వంసం చేయగా.. విరాట్ కోహ్లీ 62 నాటౌట్ (45 బంతులు: 4×4, 2×6), . దేవదత్ పడిక్కల్ 40 నాటౌట్ (28 బంతులు: 5×4, 1×6) కీలక ఇన్నింగ్స్‌తో విజయలాంఛనాన్ని పూర్తి చేశారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో కుమార్ కార్తీకేయ వికెట్ దక్కించుకున్నాడు.
నాలుగు క్యాచ్‌లు నేలపాలు..
లక్ష్యచేధనలో బెంగళూరుకు ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి ఓవర్‌లోనే సిక్స్ బాది ఫిల్ సాల్ట్ తన దూకుడు మొదలు పెట్టాడు. అయితే జోఫ్రా ఆర్చర్‌లో అతను ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను బౌండరీ లైన్ వద్ద హెట్మేయర్ అందుకోలేకపోయాడు. సందీప్ శర్మ వేసిన మరుసటి ఓవర్‌లో కోహ్లీ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను రియాన్ పరాగ్ నేలపాలు చేశాడు. అదే ఓవర్ ఐదో బంతికి ఫిల్ సాల్ట్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను సందీప్ శర్మ అందుకోలేకపోయాడు. సందీప్ శర్మ వేసిన 6వ ఓవర్‌లో ఫిల్ సాల్ట్ ఇచ్చిన క్యాచ్‌తో పాటు రనౌట్ అవకాశాన్ని యశస్వి జైస్వాల్ వృథా చేశాడు. దాంతో పవర్ ప్లేలో బెంగళూరు వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసింది. పవర్ ప్లేలోనే బెంగళూరు బ్యాటర్లు ఇచ్చిన 4 క్యాచ్‌లను రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు నేలపాలు చేసి భారీ మూల్యం చెల్లించుకున్నారు.
సాల్ట్ విధ్వంసం..
జోరు మీదున్న ఫిల్ సాల్ట్ హసరంగా బౌలింగ్‌లో బౌండరీ బాది 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే ఫిల్ సాల్ట్‌ను కార్తీకేయ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి తొలి వికెట్‌కు నమోదైన 92 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. క్రీజులోకి వచ్చిన పడిక్కల్ సాయంతో కోహ్లీ ఆచితూచి ఆడాడు. పిచ్ కండిషన్స్‌కు తగ్గ ట్లు బ్యాటింగ్ చేసిన కోహ్లీ.. హసరంగా బౌలింగ్‌లో సిక్స్ బాది 39 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. పడిక్కల్ ఇచ్చిన క్యాచ్‌ను తీక్షణ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో చెలరేగిన అతను సందీప్ శర్మ బౌలింగ్‌లో బౌండరీ బాది బెంగళూరుకు సునయాస విజయాన్ని కట్టబెట్టాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News