Sunday, April 20, 2025

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్‌సిబి

- Advertisement -
- Advertisement -

ఛండీగఢ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ముల్లాన్‌పూర్‌లోని మహరాజ యాదవింద్ర సింగ్ స్టేడియం వేదికగా.. పంజాబ్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. శుక్రవారం ఈ రెండు జట్లు చిన్నస్వామి వేదికగా తలపడ్డాయి. వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్‌లో నెగ్గి.. ప్రతీకారం తీర్చుకోవాలని ఆర్‌సిబి భావిస్తుండగా.. పంజాబ్ మరోసారి విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ అదే టీంతో బరిలోకి దిగుతుండగా.. ఆర్‌సిబి ఒక మార్పు చేసింది. లైమ్ లివింగ్‌స్టోన్ స్థానంలో రొమారియో షెపర్డ్‌ని జట్టులోకి తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News